raviteja: 'నేల టికెట్' కోసం రైల్వే స్టేషన్ లో రవితేజ!

  • కల్యాణ్ కృష్ణతో రవితేజ 
  • కథానాయికగా మాళవిక శర్మ 
  • వేసవిలో విడుదల చేయాలనే ప్లాన్ 

'రాజా ది గ్రేట్' తో సూపర్ హిట్ ను అందుకున్న రవితేజ .. ఆ తరువాత 'టచ్ చేసి చూడు' సినిమాతో పరాజయాన్ని చవిచూడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. దాంతో వెంటనే మరో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడి రైల్వే స్టేషన్ సెట్ లో రవితేజ .. అలీ .. సంపత్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని హైలైట్స్ లో ఈ సీన్స్ ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. జగపతిబాబు విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా మాళవిక శర్మ కనిపించనుంది. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో కల్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి . 

  • Loading...

More Telugu News