sai pallavi: 'కణం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బైక్ పై సాయిపల్లవి!

  • హైదరాబాద్ లో 'కణం' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • చెన్నై నుంచి వచ్చిన సాయిపల్లవి 
  • ఆమె సమయస్ఫూర్తికి అభినందనలు

తెలుగు ప్రేక్షకుల్లో సాయిపల్లవికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. 'ఫిదా' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి, త్వరలో 'కణం' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. తమిళంలో 'కరు' పేరుతో రూపొందిన ఈ సినిమా అదే రోజున తెలుగులో 'కణం' పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ .. ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.

ఆ రోజున ఆమె చెన్నై నుంచి బయలుదేరిన విమానం ఆలస్యంగా హైదరాబాద్ కి చేరుకుంది. పార్క్ హయత్ హోటల్ కి చేరుకున్న ఆమె చకచకా ప్రీ రిలీజ్ వేడుకకి బయలుదేరింది. ఆ సమయంలో ఆ దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో, కారు వద్దని చెప్పేసి ఆమె అసిస్టెంట్ బైక్ పై ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి చేరుకుంది. ఆమె అలా బైక్ పై రావడం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు .. ఆమె సమయస్ఫూర్తిని అభినందించారు. సాయిపల్లవి సింప్లిసిటీ గురించి చెప్పుకునే సంఘటనల్లో ఇది ఒకటిగా చేరిపోయింది.              

sai pallavi
nagashourya
  • Loading...

More Telugu News