mamatha banerjee: మమతా బెనర్జీ సరికొత్త నినాదం ఇదే!

  • 'టార్గెట్ లాల్ ఖిల్లా' నినాదాన్ని అందుకున్న మమతా
  • తమ లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే అని స్పష్టం చేసిన బెంగాల్ సీఎం
  • నేతాజీ నినాదమే తమ నినాదం అన్న మమతా

తమ ఏకైక లక్ష్యం ఢిల్లీ ఎర్రకోటనే అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సింహనాదం చేశారు. ఛలో ఢిల్లీ అంటూ పిలుపునిచ్చారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో... తమ తదుపరి టార్గెట్ పశ్చిమ బెంగాల్ అంటూ బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సవాల్ విసురుతూ, 'టార్గెట్ లాల్ ఖిల్లా' నినాదాన్ని ఆమె అందుకున్నారు. బెంగాల్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే... సంపూర్ణ స్వర్ణ యుగం వచ్చినట్టేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన 'ఛలో ఢిల్లీ' నినాదాన్నే తాము కూడా నమ్ముతామని చెప్పారు. బెంగాల్ కేవలం ఈ దేశాన్నే కాదు... యావత్ ప్రపంచాన్ని కూడా గెలుచుకోగలదని అన్నారు. 

mamatha banerjee
target lal khilla
amith shah
  • Loading...

More Telugu News