Supreme Court: నిఖా హలాల్ ను అత్యాచారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టులో పిల్!

  • బహుభార్యత్వాన్ని నేరంగా గుర్తించాలి
  • నిఖాహలాల్ ను ఐపీసీ సెక్షన్ 375 కింద చేర్చాలి
  • పిల్ దాఖలు చేసిన న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్

ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్న నిఖా హలాల్ ను అత్యాచార నేరంగా పరిగణించాలని, బహుభార్యత్వాన్ని నేరంగా గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుకాగా, ధర్మాసనం దాన్ని విచారించనుంది. ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త అశ్వనీ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ముస్లిం పర్సనల్ లా సెక్షన్ 2 కింద నిఖా హలాల్, బహుభార్యత్వంలను రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయించాలని తాను సుప్రీంకోర్టును కోరినట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా నిఖా హలాల్ ను ఐపీసీ సెక్షన్ 375 కింద అత్యాచారంగా భావించేలా ఆదేశాలు ఇవ్వాలని, ట్రిపుల్ తలాక్ ను ఐపీసీ సెక్షన్ 498 కింద, బహుభార్యత్వాన్ని సెక్షన్ 494 కింద చేర్చాలని కోరినట్టు తెలిపారు.

కాగా,  ధర్మాసనం ముందు ఇప్పటికే ట్రిపుల్‌ తలాక్‌, నిఖా హలాల్‌, బహుభార్యత్వం కేసులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. సమానత్వం కోసం ముస్లిం మహిళలు ఆరాట పడుతుండగా, కేసుల విచారణను శీఘ్రగతిన పూర్తి చేయాలని అత్యున్నత ధర్మాసనం భావిస్తోంది.  

  • Loading...

More Telugu News