China: డోక్లాంలో చైనా సైన్యం మోహరింపు...హెలీపాడ్ నిర్మాణం: లోక్ సభలో నిర్మలాసీతారామన్
- భారత్, చైనాల మధ్య వివాదాస్పద డోక్లాం సమస్య
- డోక్లాం వద్ద చైనా నిర్మాణ పనులు
- హెలీప్యాడ్స్, కందకాలు, ఇతర నిర్మాణాలు
గత జూన్ లో 73 రోజులపాటు భారత్, చైనాల మధ్య తీవ్ర విభేదాలు రేపిన వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో మరోసారి చైనా కదలికలు తీవ్రమయ్యాయని లోక్ సభకు రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. డోక్లామ్ సరిహద్దుల వద్ద చైనా సైన్యం నిర్మాణాలు చేపడుతున్నట్టు విడుదలైన ఉపగ్రహ ఛాయాచిత్రాలపై పార్లమెంటులో ప్రశ్నించగా, ఆమె నిజమేనని అంగీకరించారు.
డోక్లాం వద్ద చైనా సైన్యం హెలిప్యాడ్స్, కందకాలు, ఇతర నిర్మాణ పనులు చేపట్టిందని ఆమె ప్రకటించారు. శీతాకాలం సమయంలో చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించిందని, దీనిని ఆ దేశ దౌత్యాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆమె చెప్పారు. దీనిపై పలుమార్లు సమావేశమై, భారత్ ఆందోళనను వివరించామని ఆమె తెలిపారు.