Rahul Gandhi: ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మిపై స్పందించిన రాహుల్ గాంధీ

  • ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం
  • ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్‌ బలాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తాం
  • మ‌ళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాం
  • పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు కృత‌జ్ఞ‌త‌లు

ఈశాన్య రాష్ట్రాలయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడ్డ విషయం తెలిసిందే. మేఘాలయలో ఆ పార్టీ 21 స్థానాలు గెలుచుకున్న‌ప్ప‌టికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావ‌ల‌సిన సంఖ్య లేక‌పోవ‌డంతో ఆ పార్టీ అధికారంలోకి రాలేక‌పోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మిపై స్పందించిన రాహుల్ గాంధీ... ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామ‌ని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్‌ బలాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. తాము మ‌ళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటామ‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

Rahul Gandhi
Congress
Tripura
elections
  • Loading...

More Telugu News