MS Dhoni: ఎంఎస్ ధోనీ నయా అవతార్...చూడండి

  • చాక్లెట్ యాడ్ కోసం ధోనీ సరికొత్త అవతారం
  • గతంలో లాగా పొడవాటి జుత్తుతో దర్శనం
  • బాగుందంటూ నెటిజన్ల ట్వీట్లు

వాణిజ్య ప్రకటనల విషయంలో టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ జోరు కొంతకాలంగా తగ్గింది. అందుకు కారణం ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని అవకాశాలను కొల్లగొట్టడమే. అయినా సరే ధోనీ క్రేజ్‌ను కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకుంటున్నాయి. సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని వచ్చిన 'మిస్టర్ కూల్' కొత్త గెటప్‌లో కనిపించి అభిమానులను అలరించాడు.

శ్రీలంకలో రేపటి నుంచి జరగనున్న ముక్కోణపు సిరీస్ నుంచి అతనికి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు దొరికిన సమయాన్ని ఓ చాక్లెట్ యాడ్‌లో నటించేందుకు అతను ఉపయోగించుకున్నాడు. ఇందులో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త గెటప్‌లో అతను దర్శనమిచ్చాడు. క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎలాగైతే పొడవాటి జుత్తుతో ఉండేవాడో అలాంటి గెటప్‌లోనే ఈ యాడ్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ గెటప్ బాగుందంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు.

MS Dhoni
Chocolate Ad
Srilanka Tri series
  • Loading...

More Telugu News