KCR: జేసీబీ నడిపిన తెలంగాణ మంత్రి పద్మారావు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-67ac35a1163019c331cfcd3f6be424ac9a815590.jpg)
- సికింద్రాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమిపూజ
- రాష్ట్ర ప్రభుత్వానికి స్థలాల కొరత ఉంది- పద్మారావు
- డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మిగులు రైల్వే స్థలాన్ని కేటాయించాలి
- రైల్వే శాఖను ఒప్పించేందుకు సీఎం కేసీఆర్ సైతం కృషి
సికింద్రాబాద్ పరిధిలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రయత్నాలు జరుపుతున్నామని, ఈ ప్రక్రియలో సహకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉందని తెలంగాణ మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. ఈ రోజు సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా జేసీబీ నడిపించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో అధిక భాగం రైల్వే స్థలాలే ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థలాల కొరత ఉన్నందున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మిగులు రైల్వే స్థలాన్ని కేటాయించాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ ను కోరామని తెలిపారు. రైల్వే శాఖ ద్వారా సానుకూల స్పందన లభించిన వెంటనే లాలాపేట్ లో డబుల్ బెడ్రూమ్ సముదాయాలను నిర్మించాలని భావిస్తున్నామని మంత్రి పద్మారావు వివరించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-5cfd279c70de10a54f70d29ca072f3e9cee9bc37.jpg)