akhil: అఖిల్ మూడవ సినిమా కొరటాలతో?

  • 'భరత్ అనే నేను'తో బిజీగా కొరటాల  
  • నెక్స్ట్ మూవీ అఖిల్ తో నంటూ టాక్ 
  • నానితో చేయవచ్చుననే ప్రచారం

అఖిల్ రెండవ సినిమా 'హలో' కూడా ఆశించిన స్థాయిలో హిట్ కొట్టకపోవడంతో, ఆయన మూడవ సినిమాపై అభిమానులంతా ఆసక్తితో వున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి పేరు ఎక్కువగా వినిపించింది. కానీ తాజాగా కొరటాల శివ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన మహేశ్ తో చేస్తోన్న 'భరత్ అనే నేను' చివరిదశకు చేరుకుంది. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన ఎవరితోనూ కమిట్ కాలేదు.

 దాంతో నాగార్జున .. అఖిల్ మూడవ సినిమా బాధ్యతలను కొరటాల చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంతో వున్నారని చెప్పుకుంటున్నారు. కథను రెడీ చేసుకోవడంలోనూ .. కథనాన్ని నడిపించడంలోను కొరటాలకి మంచి పేరుంది. అందువలన అఖిల్ సినిమా ఆయన చేసే ఛాన్స్ చాలావరకూ ఉందని అంటున్నారు. అయితే కొరటాల తన తదుపరి సినిమాను నానితో చేసే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ వుంది.     

akhil
koratala
  • Loading...

More Telugu News