KCR: 'ముందు మా సమస్యలు పరిష్కరించండి'.. కేసీఆర్‌కు ఏపీ సచివాలయంలో పని చేస్తోన్న తెలంగాణ ఉద్యోగుల విన్నతి
- కేసీఆర్ దేశ రాజకీయాలను మారుస్తానంటున్నారు-ఉద్యోగులు
- అంతకంటే ముందు మా సమస్యలు పట్టించుకోండి
- తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడాం
- రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ ఏపీ సచివాలయంలోనే పని చేస్తున్నాం
ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బాగోలేవని, తాను మారుస్తానని కేసీఆర్ చెప్పిన మాటలపై ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేస్తోన్న తెలంగాణ ప్రాంత నాలుగో తరగతి ఉద్యోగులు మండిపడ్డారు. ముందు తమ పరిస్థితులు మార్చాలని విన్నవించుకున్నారు.
ఈ రోజు 233 మంది ఉద్యోగులు నిరసనకు దిగి, తెలంగాణ ఉద్యమంలో తాము పోరాడామని రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులంతా తెలంగాణలో ఉంటున్నారని, తాము అమరావతిలో పనిచేయడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.