Mahesh Babu: రేపే 'ది విజన్ ఆఫ్ భరత్' అంటూ ఆసక్తిని రేకెత్తిస్తోన్న టీమ్!

  • 'భరత్ అనే నేను' పై కొత్త పోస్టర్ 
  • సస్పెన్స్ లో పెడుతోన్న టీమ్ 
  • ఏప్రిల్ 20న భారీస్థాయిలో రిలీజ్

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భరత్ అనే నేను' సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు కనిపించనున్న ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని రేకెత్తించే పోస్టర్స్ ను వదులుతూ వస్తున్నారు.

అలాగే 'భరత్ అనే నేను' నుంచి .. రేపు సాయంత్రం 6 గంటలకు 'ది విజన్ ఆఫ్ భరత్' ను పరిచయం చేయనున్నట్టు చెబుతూ .. కొత్తగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాన్ఫరెన్స్ హాల్లో తన సీట్ దగ్గర  ఒంటరిగా నుంచుని దీర్ఘంగా ఆలోచిస్తూ మహేశ్ కనిపిస్తున్నాడు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలోని వాక్యాలు ఆయనకి గుర్తొస్తున్నట్టుగా .. ఆయన మనసంతా గందరగోళంగా వున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంచితే .. 'ది విజన్ ఆఫ్ భరత్' అనే పేరుతో రేపు ఈ సినిమా ఏం వదలబోతుందనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది.          

Mahesh Babu
kiara adwani
  • Loading...

More Telugu News