Daniel Weber: సరోగసీ ద్వారా ఇద్దరికి తల్లయిన సన్నీ లియోన్....!

  • గత జూన్‌లో మహారాష్ట్ర బాలిక నిషా కౌర్ దత్తత
  • తాజాగా సరోగసీతో ఇద్దరు మగ పిల్లలు
  • సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటోతో సర్‌ప్రైజ్ చేసిన వైనం

శృంగారదేవతగా వెలుగొందుతున్న పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు చేరారు. గత జూన్‌లో మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన నిషా కౌర్ వెబర్ అనే బాలికను ఆమె దత్తత చేసుకుంది. తాజాగా సరోగసీ ద్వారా ఆమె మరో ఇద్దరు మగ పిల్లలకు తల్లయింది. తన భర్త డానియల్‌తో పాటు ముగ్గురు పిల్లల్ని ఒళ్లో కూర్చుని ఉన్న ఫొటోని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

 మగపిల్లలకు అషర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అనే పేర్లు పెట్టింది. ముగ్గురు పిల్లలను పెంచడం సాధ్యమేనని తనకు అనిపించిందని, అందుకే ఇద్దరు పిల్లల్ని సరోగసీ ద్వారా పుట్టించుకున్నట్లు తన సందేశంలో పేర్కొంది. దేవుడు ప్రణాళిక ప్రకారం, తమకు పెద్ద కుటుంబం దక్కిందని ఈ శృంగార తార ఆనందం వ్యక్తం చేస్తోంది. ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా తాము చాలా గర్వపడుతున్నామని సన్నీ చెప్పింది. అందరినీ ఈ రకంగా సర్‌ప్రైజ్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది.




Daniel Weber
Sunny Leone
Instagram
  • Error fetching data: Network response was not ok

More Telugu News