Chandrababu: అమిత్ షాతో చర్చలకు యనమల పేరును కూడా చేర్చిన చంద్రబాబు!

  • ఇటీవల చంద్రబాబుకు ఫోన్ చేసిన అమిత్ షా
  • చర్చలకు రావాలని సూచించిన బీజేపీ చీఫ్
  • సుజనా, కుటుంబరావు, రామ్మోహన్ నాయుడు పేర్లు చెప్పిన చంద్రబాబు
  • తాజాగా యనమల పేరును బృందంలో చేర్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించాల్సిన బృందంలో తాజాగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి పేరును కూడా చేర్చాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల ఏపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన వేళ, బీజేపీపై చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యల తరువాత, అమిత్ షా ఫోన్ చేసి చర్చలకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

ఈ సాయంత్రం 5 గంటలకు విభజన హామీలపై చర్చ సాగనుండగా, తొలుత సుజనాచౌదరి, కుటుంబరావు, కింజరపు రామ్మోహన్ నాయుడులను పంపుతున్నట్టు వెల్లడించిన చంద్రబాబు, తాజాగా యనమలనూ వెళ్లాలని ఆదేశించారు. దీంతో బడ్జెట్ సమావేశాల తొలిరోజు సభ ముగియగానే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రజల్లోని ఆగ్రహం, నెరవేరాల్సిన విభజన హామీలు తదితరాలపై అమిత్ షాకు మరింత వివరంగా చెప్పాలంటే, యనమల ఉంటే మంచిదని సీఎం అభిప్రాయపడ్డట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Chandrababu
Amit Sha
Sujana Chowdary
CM Ramesh
Yanamala
  • Loading...

More Telugu News