Uttar Pradesh: రేపిస్ట్ మామను కొట్టిచంపిన కోడలు... పోలీసు స్టేషన్‌లో లొంగుబాటు!

  • వరుసగా రెండురోజుల పాటు అత్యాచారం
  • కర్రతో చితక్కొట్టి చంపిన వైనం
  • సహకరించిన భర్త... ఇద్దరూ పోలీసు స్టేషన్‌లో లొంగుబాటు

కోడలిని సొంత బిడ్డలా చూసుకోవాల్సిన ఓ పెద్దమనిషి ఆమెపై కన్నేశాడు. వరుసగా రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. చివరికి ఆమె చేతిలోనే తన్నులు తిని ప్రాణాలు కోల్పోయాడు. యూపీలోని పిలిభిత్‌లో ఉన్న మధోతాండ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ చిన్న గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళితే... తనపై అఘాయిత్యానికి పాల్పడిన మామను బాధిత మహిళ కర్రతో చితక్కొట్టింది.

ఇందుకు భర్త కూడా ఆమెకు సాయం చేశాడు. దెబ్బలు తట్టుకోలేక మామ చనిపోవడంతో భార్యాభర్తలిద్దరూ సమీపంలోని పోలీసు స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయారు. నిందితుని పెద్ద కుమారుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన భర్త పని కోసం బయటకు వెళ్లినప్పుడు మామ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే, హతుడి భార్య నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.

Uttar Pradesh
Pilibhit
adhotanda police station
FIR
  • Loading...

More Telugu News