Chiranjeevi: స్టీవ్ హ్యారీ షోలో చిరంజీవి 'సన్నాజాజిలా' పాటకు డ్యాన్స్... ఉర్రూతలూగిన యూఎస్ ఆడియన్స్ వీడియో!

  • 'ఖైదీ నంబర్ 150' పాటకు డ్యాన్స్
  • అద్భుతంగా నర్తించిన టీమ్
  • నిలబడి చప్పట్లు కొట్టిన ఆడియన్స్
  • వైరల్ అవుతున్న వీడియో

చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150' లోని 'సన్నాజాజాలా చుట్టేసిందిరో...' పాట అమెరికన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్టీవ్ హ్యారీషోలో ఈ తెలుగుపాటకు అక్కడి నృత్యకళాకారులు అద్భుతమైన రీతిలో డ్యాన్స్ చేయగా, చూస్తున్న ఆడియన్స్ మైమరచిపోయారు. వారి నృత్య ప్రతిభకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.

ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత, పలు చిత్రాలకు పీఆర్వోగా పని చేసిన బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. తమ మెగాస్టార్ పాట ఇలా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News