Congress: కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు: మధు యాష్కీ

  • ప్రజలను మళ్లీ మోసం చేసేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ 
  • శశికళ, లాలూ మాదిరి కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం
  • ఎంఐఎంతో అంటకాగుతున్నారు 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం నాడు సోనియా గాంధీ కాళ్లు మొక్కి మోసం చేసిన కేసీఆర్ ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని, తన అవినీతి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ‘థర్ఢ్ ఫ్రంట్’ ను తెరపైకి తెస్తున్నారని, తమిళనాడులో శశికళ, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరి కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని విమర్శించారు. కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్ కోసం ఎంతటి నీచ రాజకీయాలకైనా దిగజారుతారని మండిపడ్డ మధుయాష్కీ, నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఓటేసిన ఎంఐఎంతో అంటకాగుతున్నారని విమర్శించారు.

Congress
Madhu Yaskhi
kcr
  • Error fetching data: Network response was not ok

More Telugu News