Pawan Kalyan: పవన్ కల్యాణ్, ఇక కదలండి... జనసేన కార్యాలయానికి వెల్లువెత్తుతున్న కార్యకర్తల సందేశాలు!

  • జేఎఫ్సీ నివేదికపై పోరాటం ప్రారంభించండి
  • ఇదే సరైన సమయమంటున్న అభిమానులు
  • జనసేన కార్యాలయం వద్ద సందడి
  • పవన్ స్పందిస్తారంటున్న నేతలు

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని వెంటనే ప్రకటించి రంగంలోకి దిగాలని పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి, జనంలోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయమని పవన్ అభిమానులు నినదిస్తున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున జనసేన అభిమానులు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కల్యాణ్ ను కలుస్తున్నారు.

ఈ ఉదయం నుంచి జనసేన కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి కనిపిస్తోంది. మరోవైపు హోదాపై పోరాటం వెంటనే ప్రారంభించాలని జనసేన ఆఫీసుకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల సూచనలను పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలోనే వారి డిమాండ్లపై పవన్ స్పందిస్తారని, కార్యాలయం బయటకు వచ్చి అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న నేతలు కొందరు వ్యాఖ్యానించారు.

Pawan Kalyan
Jana Sena
Fans
Hyderabad
  • Loading...

More Telugu News