Drunk Driving: హైదరాబాదులో మందుబాబులకు తీవ్రమైన శిక్షలు మొదలు!

  • ఆరుగురి డ్రైవింగ్ లైసెన్స్ ల శాశ్వత రద్దు
  • ఇంత పెద్ద శిక్ష పడటం ఇదే మొదటిసారి
  • ఒక రోజు నుంచి 10 రోజుల జైలు శిక్ష
  • వారం వ్యవధిలో పట్టుబడిన 655 మందిపై చార్జ్ షీట్

మందు కొట్టి వాహనాలు నడిపి పట్టుబడేవారికి కోర్టు తొలిసారిగా తీవ్రమైన శిక్షలు విధించింది. గడచిన వారం రోజుల్లో ఆరు రకాల ఉల్లంఘనలకు పాల్పడి పోలీసులకు చిక్కిన 655 మందిపై చార్జ్ షీట్ దాఖలుకాగా, ఎర్రమంజిల్ లోని మెట్రో పాలిటన్ కోర్టు ఆరుగురి డ్రైవింగ్ లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కోర్టు ఇంత పెద్ద శిక్ష విధించడం ఇదే మొదటిసారి. మరో నలుగురి లైసెన్స్ లను మూడు సంవత్సరాలు, పది మందివి రెండు సంవత్సరాలు, ఎనిమిది మందివి ఏడాది, ఇద్దరివి ఆరు నెలలు, 49 మందివి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ న్యాయమూర్తి శిక్షలు విధించారు.

 ఇక అధిక మోతాదులో మద్యం తాగి పట్టుబడిన మందుబాబుల్లో ఒకరికి 10 రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, 9 మందికి ఐదు రోజులు, పది మందికి 4 రోజులు, 18 మందికి 3 రోజులు, 69 మందికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. మైనర్ లకు బండ్లు ఇచ్చిన 36 మంది తండ్రులు, యజమానులకు ఒకరోజు జైలు శిక్ష పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ, చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని నడుపుతున్న వారిలో 21 మందికి ఒక రోజు, 12 మందికి రెండు రోజుల శిక్ష పడగా, అందరినీ చంచల్ గూడ జైలుకు తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీరికి పాస్ పోర్టు, వీసాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడంలో ఇబ్బందులు ఏర్పడతాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News