holi: విమానంలో హోలీ రంగులు చల్లుకుని, స్టెప్పులు!

  • ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ హోలీ వేడుక‌లు
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అభినందనలు
  • ప్రయాణికుల జీవితాల్లో ఆనందాల రంగులను తీసుకొచ్చారని ప్రశంస

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ హోలీ వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. మంచి సంగీతం వినిపిస్తూ, ప్ర‌యాణికుల‌కు హోలీ రంగులు పూస్తూ ఆ సంస్థ ఉద్యోగులు క‌న‌ప‌డ్డారు. కేవ‌లం ఎయిర్ పోర్టులోనే కాకుండా విమానంలోనూ పండుగ చేశారు. స్పైస్ జెట్ సిబ్బంది పెట్టిన మ్యూజిక్‌కి కొందరు ప్రయాణికులు స్టెప్పులేశారు. స్పైస్ జెట్ మాత్రమే కాకుండా ఇండిగో కూడా హోలీ వేడుకలు నిర్వహించి ప్రయాణికులను అలరించింది. స్పైస్‌జెట్ నిర్వహించిన హోలీ పండుగ పట్ల మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేస్తూ.. ప్రయాణికుల జీవితాల్లో ఆనందాల రంగులను తీసుకొచ్చారని, సంతోషంగా గడిపితే అందరి జీవితాల్లోనూ ప్రతిరోజూ హోలీనే అని పేర్కొన్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News