elections: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ!

  • ఆయా రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు
  • ఈశాన్య భారతదేశంలోని ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం
  • ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి ప్రజలు మద్దతిచ్చారు
  • భారతీయులు మా అభివృద్ధి ఎజెండాపై నమ్మకం ఉంచారు

వరుస విజయాలతో దూసుకుపోతోన్న భారతీయ జనతా పార్టీ త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆయా రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశంలోని ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. తాము ప్రకటించిన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’, సుపరిపాలనల అంశాలకు ప్రజలు మద్దతిచ్చారని అన్నారు. భారతీయులు తమ అభివృద్ధి ఎజెండాపై నమ్మకం ఉంచారని, అందుకే తమకు పట్టం గడుతున్నారని అన్నారు.   

elections
Narendra Modi
Tripura
  • Loading...

More Telugu News