KCR: ఆ రోజు నేను 'ప్రధాని గారికి' అని మాత్రమే అన్నాను.. అనుచిత వ్యాఖ్యలు చేయలేదు!: కేసీఆర్‌ వివరణ

  • ప్రధానిని కించపర్చానని బీజేపీ నేతలు అనుకుంటే అనుకోనీ
  • ప్రధానమంత్రిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఉందా? 
  • 'కేసీఆర్ కి జైలుకి పోవాలని ఉందా?' అని బీజేపీ నేతలు అంటున్నారు
  • మాట్లాడిన వారందరినీ జైలుకి పంపిస్తారా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవల ఓ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకవచనంతో సంబోధిస్తూ అభ్యంతరకరంగా మాట్లాడారని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేసీఆర్ స్పందించారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను ఆ రోజు 'ప్రధాని గారిని' అని అన్నానని అంతేగానీ, అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

తాను ప్రధానిని కించపర్చానని బీజేపీ నేతలు అనుకుంటే అలాగే అనుకోనీ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు. 'కేసీఆర్ కి జైలుకి పోవాలని ఉందా?' అని బీజేపీ నేతలు అంటున్నారని, 'మాట్లాడిన వారందరినీ జైలుకి పంపిస్తారా?' అని కేసీఆర్ నిలదీశారు. తాను తన వద్ద ఉన్న ఆస్తులన్నింటిపై ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నానని, అక్రమ సంపాదనకు పాల్పడే వారే భయపడతారని, తాను కాదని అన్నారు.  

  • Loading...

More Telugu News