Narendra Modi: కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి

  • కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే
  • అంతవరకు ఆయనను వదిలిపెట్టం
  • కేసీఆర్ వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు

ప్రధాని మోదీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే కేటీఆర్, కవితలు క్లారిటీ ఇచ్చారు. కావాలని కేసీఆర్ ఏమీ అనలేదని... పొరపాటున, టంగ్ స్లిప్ అయిందని వారు చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ పై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు.

ప్రధానిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన కుటుంబసభ్యులు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఏమాత్రం హర్షించలేనివని అన్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ మాట్లాడే మాటలు ఇవేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని... అంతవరకు ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... కేసీఆర్ కు పట్టడం లేదని విమర్శించారు. 

Narendra Modi
kishan reddy
KCR
KTR
kavitha
  • Loading...

More Telugu News