sai dharam tej: పవన్ ను రప్పించే ప్రయత్నంలో సాయిధరమ్ తేజ్

  • కరుణాకరన్ దర్శకత్వంలో ప్రేమకథాంశం 
  • హిట్ కొట్టాలనే పట్టుదలతో తేజు
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్

మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన సాయిధరమ్ తేజ్ కి ఈ మధ్య హిట్ పడటం లేదు. దాంతో తేజుతో పాటు ఆయన అభిమానులంతా నిరాశకి లోనవుతున్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, పూర్తిస్థాయి ప్రేమకథాంశంగా రూపొందుతోంది. ఈ సినిమా సక్సెస్ పైనే తేజు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

ప్రమోషన్స్ పరంగాను ఈ సినిమాను మరింతగా జనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నాడు. అందువల్లనే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కల్యాణ్ ను ముఖ్య అతిథిగా రప్పించాలని ఆలోచనలో వున్నాడట. ఎందుకైనా మంచిదని ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టాడని అంటున్నారు. మొదటి నుంచి తేజు కెరియర్ గ్రాఫ్ ను గమనిస్తూ .. సూచనలిస్తూ వస్తోన్న పవన్, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి తప్పకుండా వస్తాడనే అంటున్నారు.           

sai dharam tej
pavan kalyan
  • Loading...

More Telugu News