jio: కొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టిన జియో!

  • రూ.1999తో  'జియోఫై' డివైస్ ని కొంటే రూ.3,595 విలువ గల ప్రయోజనాలు
  • రూ.1,295 డేటా రూపంలో, రూ.2,300 వోచర్ల రూపంలో లభిస్తాయి
  • రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకోవాలి

జియో తన 'జియోఫై' డివైస్ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. జియోఫై పరికరాన్ని రూ.1999కి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.3,595 విలువ గల ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ.1,295 డేటా రూపంలో లభించగా మిగతా రూ.2,300 వోచర్ల రూపంలో లభించనున్నాయి. ఈ వోచర్లను డిజిటల్ వాలెట్లు అయిన పేటీఎం, ఏజియో, రిలయన్స్‌ డిజిటల్‌ షాపింగ్‌లలో ఉపయోగించుకోవచ్చు. తాజా ఆఫర్‌లో భాగంగా రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది.

jio
jiofi
device
smartphone
  • Error fetching data: Network response was not ok

More Telugu News