allari naresh: రఘువరన్ అమ్మాయైతే నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని: అల్లరి నరేశ్

  • నాకు రఘువరన్ అంటే ఇష్టం 
  • 'శివ' సినిమాలో ఆయన నటనకి ఆశ్చర్యపోయాను 
  • నేను కామెడీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు

హాస్యకథానాయకుడిగా అల్లరి నరేశ్ కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ " నేను నటుడిని కావాలని మా అమ్మగారికి ఉండేది. నాకు మొదటి నుంచి రఘువరన్ యాక్టింగ్ అంటే ఇష్టం. రజనీకాంత్ పక్కనైనా ఆయన విలనే .. చిరంజీవి పక్కనైనా ఆయన విలనే .. చూడటానికి మాత్రం చాలా సన్నగా ఉంటాడు".

 "అప్పటి వరకూ విలన్ అంటే కండలు పెంచుకుని .. ముఖంపై కత్తిగాటుతో విచిత్రంగా వుండేవాళ్లు. అలాంటిది 'శివ' సినిమాలో విలన్ గా రఘువరన్ ను చూసి ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి ఆయన నటనను అభిమానించడం మొదలైంది. ఆయన అమ్మాయైతే పెళ్లి చేసుకుని ఉండేవాడిని. ఆయనను చూసిన దగ్గర నుంచి విలన్ కావాలని ఉండేది .. యాక్టింగ్ ఇనిస్టిస్ట్యూట్ లో ఎప్పుడూ కూడా నేను కామెడీ సీన్ చేసి చూపించలేదు. అలాంటిది కామెడీ హీరోగా మారానంటే నాకే ఆశ్చర్యంగా వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.  

allari naresh
  • Loading...

More Telugu News