vishnukumar raju: టీడీపీకి ఇలా చేయడం కొత్తేమీ కాదులెండి!: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విసుర్లు

  • ఇతరులతో కలసి బీజేపీపై బురదజల్లుతోంది
  • ఉన్నది లేనట్టు, లేదని ఉన్నట్టు చెప్పుకోవడం టీడీపీకి అలవాటే
  • చంద్రబాబుకు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారు

తమ మిత్రపక్షం టీడీపీపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇతర పార్టీలతో కలసి బీజేపీపై టీడీపీ బురదజల్లుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

 ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పుకోవడం టీడీపీకి కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. ఓట్లు రాబట్టుకోవడం టీడీపీకి బాగా తెలుసని విమర్శించారు. మిత్ర ధర్మాన్ని టీడీపీ కాలరాస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరో తప్పుడు సలహాలను ఇస్తున్నారని అన్నారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నది బీజేపీనే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, వారిదే గెలుపని చెప్పారు. 

vishnukumar raju
Telugudesam
BJP
Chandrababu
  • Loading...

More Telugu News