Special Category Status: ఢిల్లీలో మొదలైన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమాలు

  • ఢిల్లీలో మొదలైన ప్రత్యేక హోదా సెగ
  • నిరసన చేపట్టిన ప్రత్యేక హోదా సాధన సమితి
  • కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిక

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అప్పుడే నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా సాధన కమిటీ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను మొదలు పెట్టింది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఏపీ భవన్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి, నాన్ పొలిటికల్ జేఏసీలు ఆందోళన చేపట్టాయి. హోదాపై సరైన రీతిలో స్పందించకపోతే... కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా నేతలు హెచ్చరించారు. విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 

Special Category Status
delhi
protests
  • Loading...

More Telugu News