up minority commission: ఆయన హృదయం, మెదడు చిన్నవి: అసదుద్దీన్ పై యూపీ మైనారిటీ కమిషన్ సభ్యురాలి వ్యంగ్యం

  • నోరు మాత్రం పెద్దది
  • ఉద్రిక్తతలను రాజేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆయన పని
  • సోఫియా అహ్మద్ స్పందన

మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై యూపీ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సోఫియా అహ్మద్ మండిపడ్డారు. ‘‘ఆయన హృదయం చిన్నది. ఆయన మెదడు కూడా చిన్నదే. కానీ పెద్ద నోరు మాత్రం ఉంది. ఉద్రిక్తతలను రాజేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఆయన చేసే పని’’ అని సోఫియా అహ్మద్ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు కట్టితీరుతామని, ఈ డిమాండ్ ను ముస్లింలు వదిలి పెట్టరంటూ అసదుద్దీన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే, బాబ్రీ మసీదు అంశంపైనే ఆయన ఘాటుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సోఫియా అహ్మద్ వాటికి కౌంటర్ గా మాట్లాడారు. సోఫియా ట్రిపుల్ తలాక్ బాధితురాలు, బీజేపీ నేత కూడా! 

up minority commission
sophia ahmed
  • Loading...

More Telugu News