louis vuitton: కోహ్లీ వాలెట్ ధర ఎంతో తెలుసా?...అక్షరాల 81,144 రూపాయలు!

  • ప్రపంచ కోటీశ్వరులు మోజుపడే వాలెట్ ను వాడుతున్న కోహ్లీ
  • లూయిస్ విటాన్ జిప్సీ ఎక్స్ఎల్ వాలెట్
  • విలాసవంతమైన బ్యాగులు, వాలెట్లకు లూయిస్ విటాన్ పెట్టింది పేరు

పెద్దనోట్ల రద్దు అనంతరం కరెన్సీ వినియోగం తగ్గిన సంగతి తెలిసిందే. యువతరం మొత్తం ఆన్ లైన్ లోనే కొనుగోళ్లు పూర్తికానిచ్చేస్తున్నారు. కార్డుల వినియోగం పెరగడానికి తోడు కరెన్సీ వినియోగం తగ్గిపోవడంతో వాలెట్ల వినియోగం తగ్గుతోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వాడుతున్న వాలెట్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఫ్యాషన్ బ్రాండ్ ను నిర్వహిస్తున్న కోహ్లీ, ప్రపంచంలోని కోటీశ్వరులు మోజుపడే వాలెట్‌ ను వాడుతున్నాడు.‌ నల్లరంగులోని లూయిస్‌ విటాన్‌ జిప్పీ ఎక్స్‌ఎల్‌ వ్యాలెట్‌ ను కోహ్లీ వినియోగిస్తున్నాడు. లూయిస్ విటాన్ బ్రాండ్ విలాసవంతమైన బ్యాగులు, వాలెట్లకు పెట్టింది పేరు. కోహ్లీ వాడుతున్న ఈ వాలెట్‌ ధర 1,250 డాలర్లు.. అంటే  81,144 రూపాయలని అంచనా. 

louis vuitton
louis vuitton designer
Virat Kohli
fashion
  • Loading...

More Telugu News