jn tata birth annivarsary: జంషెడ్ పూర్ కు పండుగ కళ... నేడు టాటా వ్యవస్థాపకుడి జయంతి

  • జేఎన్ టాటా 179వ జయంతి
  • ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు
  • దేశ పారిశ్రామిక పితామహుడిగా ప్రసిద్ధి

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ పండుగ కళ సంతరించుకుంది. కారణం నేడు నుస్సెర్ వాంజి టాటా (జేఎన్) 179వ జయంతి. జేఎన్ టాటా దేశ పారిశ్రామిక పితామహుడిగా పేరొందిన వ్యక్తి. 1839 మార్చి 3న ఆయన జన్మించారు. అతిపెద్ద టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించినది ఈయనే. ఏటా జేఎన్ టాటా జయంతి నాడు స్టీల్ సిటీగా పేరుగాంచిన జెంషెడ్ పూర్ (టాటా స్టీల్ ఫ్యాక్టరీల కేంద్రం) పండుగ కళ సంతరించుకోవడం సాధారణమే. జేఎన్ టాటా జీవితాన్ని గురించి తెలియజేసే 28 నిమిషాల లేజర్ షోను బెల్డి సదస్సు వద్ద నేడు ప్రదర్శించనున్నారు. అలాగే, జేఎన్ టాటాకు ఘన నివాళి తెలిపే కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనికి టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ హాజరవుతారు.

jn tata birth annivarsary
jamshedpur
  • Loading...

More Telugu News