nithin: ఉత్సాహాన్ని రేకెత్తిస్తోన్న 'ఛల్ మోహన్ రంగ' సాంగ్

  • ప్రేమకథాంశంగా 'ఛల్ మోహన్ రంగ'
  • తాజాగా షికారు చేస్తోన్న సాంగ్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు    

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ .. మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'ఛల్ మోహన్ రంగ' .. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ గమ్మత్తైన సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఫస్టులుక్కు సోమావారం .. మాట కలిపే మంగళవారం .. బుజ్జిగుంది బుధావారం .. గొడవయ్యింది గురువారం .. సారీ అంది శుక్కురవారం .. సెన్సర్ కట్టు శనీవారం .. రెస్టు లేదు ఆదివారం .. ప్రేమే వుంది ఏ వారం..' అంటూ ఈ పాట కొనసాగుతోంది.

ఆ తరువాత నుంచి ఈ పాట జోరందుకుంటోంది. తమన్ అందించిన ఈ పాట కొత్తగా అనిపిస్తూ యూత్ ను ఆకట్టుకునేదిలావుంది. 'లై' సినిమా తరువాత నితిన్ .. మేఘా ఆకాశ్ కలిసి చేస్తోన్న సినిమా ఇది. ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఇద్దరూ వున్నారు. పవన్ .. త్రివిక్రమ్ .. నితిన్ నిర్మిస్తోన్న ఈ సినిమా, ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి. 

nithin
megha
  • Error fetching data: Network response was not ok

More Telugu News