ntr: ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి రిహార్సల్స్!

  • రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ 
  • జూలైలో 20 రోజులపాటు రిహార్సల్స్ 
  • ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్

ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను రాజమౌళి సిద్ధం చేశారట. ఒకేసారి ఎన్టీఆర్ .. చరణ్ లకు ఈ స్క్రిప్ట్ ను వినిపించనున్నట్టు సమాచారం. ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించి జూలైలో వర్క్ షాప్ ను నిర్వహించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.

 దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ వర్క్ షాప్ లో ఎన్టీఆర్ .. చరణ్ లకు రిహార్సల్స్ ను నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. గతంలో 'బాహుబలి' సినిమాకి రానా .. ప్రభాస్ లతో వర్క్ షాప్ నిర్వహించిన రాజమౌళి, ఈ సినిమాకి కూడా వర్క్ షాప్ ను నిర్వహించనుండటం విశేషం. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను కానీ .. కథానాయికలనుగానీ .. ప్రతినాయకుడును గాని ఫిక్స్ కాలేదు. త్వరలోనే ఆ వివరాలను వెల్లడి చేయనున్నారు.   

  • Loading...

More Telugu News