kerala: చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన కేరళ సీఎం పినరయి విజయన్

  • ఈ తెల్లవారుజామున చేరిక
  • ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు
  • ఏమైందన్న దానిపై రాని అధికారిక ప్రకటన 

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నట్టుండి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఈ రోజు తెల్లవారుజామున చేరారు. ఏం జరిగిందన్న దానిపై అధికారికంగా ప్రకటన లేదు. కానీ చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు విజయన్ ను ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షిస్తోంది. ఇందులో ఇన్ఫెక్షన్ వ్యాధి నిపుణులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి 72 ఏళ్ల విజయన్ ఏదైనా ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అల్లరిమూకల చేతిలో హత్యకు గురైన మధు చందకి కుటుంబాన్ని కేరళ సీఎం నిన్న పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.

kerala
Chief Minister
pinarayi vijayan
  • Loading...

More Telugu News