Gilu Joseph: ‘ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్’ ఫొటోపై స్పందించిన నటి

  • నిన్నటి వరకు నన్ను కవి అని పొగిడారు
  • నేడు నీతిమాలిన దానినని అంటున్నారు
  • ఫొటోకు పోజిచ్చినందుకు నయా పైసా కూడా తీసుకోలేదు
  • విమర్శలపై స్పందించిన నటి గిలూ జోసెఫ్

తనపై వస్తున్న విమర్శలపై మలయాళ నటి గిలు జోసెఫ్ స్పందించింది. మలయాళ మేగజైన్‌ ‘గృహలక్ష్మి’ కవర్‌ పేజీపై ఓ బిడ్డకు ఆచ్ఛాదన లేకుండా పాలిస్తూ పోజిచ్చిన నటి గిలు జోసెఫ్‌పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. బిడ్డకు బహిరంగంగా పాలివ్వడంపై కొందరు మండిపడ్డారు. పెళ్లికాని నటి ఇటువంటి ఫొటో షూట్‌లు చేయడమేంటని ప్రశ్నించారు. సోషల్  మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. ఇదంతా పబ్లిక్ స్టంట్ అని తూర్పారబట్టారు. అంతేకాదు.. పలువురు ఆమెపైనా, ఆ ఫొటోను ప్రచురించిన మేగజైన్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసులు నమోదు చేశారు.  

తన ఫొటోపై దుమారం చెలరేగడంతో గిలు జోసెఫ్ స్పందించింది. ఆ ఫొటోకు పోజిచ్చినందుకు తాను నయా పైసా కూడా తీసుకోలేదని, అది పబ్లిక్ స్టంట్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. గ్రాఫిక్ ఫొటోలను చూడడాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారని, అటువంటివి చూడడంలో వారికి ఎటువంటి ఇబ్బందీ లేదని, కానీ ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తూ కనిపిస్తే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించింది. నిన్నటి వరకు తనను గొప్ప కవిగా పొగిడిన వారే నేడు నీతి తప్పిన దానిగా, వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Gilu Joseph
breastfeeding
photoshoot
Malayalam
  • Loading...

More Telugu News