love: ఈ తూరుపు... ఆ పశ్చిమం!: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఆంధ్రుడు, అమెరికా యువతి!

  • విజయవాడలోని ఓ హోటల్‌లో పెళ్లి
  • గుంటూరు జిల్లా వినుకొండలోని పొట్టూరుకి చెందిన వరుడు రాము
  • అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లి లొరెనా అనే అమ్మాయితో లవ్‌
  • పెద్దల సమక్షంలో వివాహం

ఆ అబ్బాయిది ఆంధ్రప్రదేశ్‌.. అమ్మాయిది అమెరికా... వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. తాజాగా పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వారిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. విజయవాడలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి జరిగింది. ఆ వరుడి పేరు రాము.. అతడిది గుంటూరు జిల్లా వినుకొండలోని పొట్టూరు.

అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లగా, కాలేజీలో లొరెనా అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుని, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. రాములోని కష్టించేతత్వం తనకు బాగా నచ్చిందని లొరెనా తెలిపింది. మూడేళ్లు ప్రేమలో మధురానుభూతులను పొందిన వారిరువురూ ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో దంపతులయ్యారు. వారి పెళ్లికి మొదట పెద్దలు అడ్డుచెప్పినా.. చివరకు ఒప్పుకున్నారు.   

love
marriage
Vijayawada
  • Error fetching data: Network response was not ok

More Telugu News