Telugudesam: దేశంలోని వివిధ పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించిన టీడీపీ

  • విభజన హామీలపై జాతీయ స్థాయిలో పోరాటం
  • అన్ని పార్టీలకు లేఖలు
  • టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జాతీయ స్థాయి పోరాటానికి టీడీపీ సిద్ధమైంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి వివరిస్తూ దేశంలోని వివిధ పార్టీలకు లేఖలు రాయాలని ఈరోజు జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన సమయంలో పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు, ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రస్తుత ప్రధాని ఇచ్చిన హామీలు తదితర అంశాలన్నింటినీ లేఖలో పొందుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేయాలని నిర్ణయించారు. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


Telugudesam
Special Category Status
letter
national parties
  • Loading...

More Telugu News