Chandrababu: టీఆర్ఎస్ తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు: వైసీపీ

  • ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటామంటూ కొత్త డ్రామాకు తెరలేపారు
  • బీజేపీతో కలసి ఏపీని నాశనం చేశారు
  • స్వార్థంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు

ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కలసి ఏపీని చంద్రబాబు నాశనం చేశారని మండిపడ్డారు. అప్పులు, హత్యలు, నేరాలు, అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపారని అన్నారు. ఏపీ ప్రజలంతా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గళమెత్తుతుంటే... చంద్రబాబు మాత్రం బలహీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని అన్నారు.

Chandrababu
vasireddy padma
TRS
  • Loading...

More Telugu News