kcr: మా బాబాయి కేసీఆర్ మస్కట్ పైరవీలు చేసేవారు: టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమ్యరావు
- ఇప్పుడు కన్సల్టెన్సీస్ చేస్తున్న పనిని అప్పుడు కేసీఆర్ చేసేవారు
- గల్ఫ్, దుబాయ్ కు పంపిస్తుండే వారు
- హైదరాబాద్, ఢిల్లీ నుంచి ఈ పని చేస్తుండేవారు
- ఓ ఇంటర్వ్యూలో రమ్యరావు
తన బాబాయి కేసీఆర్ ఒకప్పుడు మస్కట్ పైరవీలు చేసేవారని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కేసీఆర్ అన్న కుమార్తె రమ్యరావు అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ప్రశ్న : మస్కట్ పైరవీల ద్వారా ఏం చేసే వారు?
రమ్యరావు : ఇప్పుడు, కన్సల్టెన్సీ వాళ్లు ఏం చేస్తున్నారో, అప్పుడు, ఆయన (కేసీఆర్) అదే చేసే వారు. చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారిని కన్సల్టెన్సీ ద్వారా ఎలా పంపిస్తారో, అదే విధంగా, గల్ఫ్, దుబాయ్ కు వెళ్లే వారిని కేసీఆర్ నాడు పంపిస్తుండేవారు.
ప్రశ్న : ఇందుకు సంబంధించిన ఆఫీసు ఎక్కడ పెట్టారు?
రమ్యరావు : ఆఫీసు ఎక్కడపెట్టారో నాకు తెలియదు. హైదరాబాద్, ఢిల్లీ నుంచి కేసీఆర్ ఈ పని చేస్తుండేవారు.
ప్రశ్న : మీ నాన్నగారు ఏం చేసేవారు?
రమ్యరావు : వ్యవసాయం చేసేవారు. మా నాన్న గారికి పాలిటిక్స్ అంటే ఆసక్తి ఉండేది. మా గ్రామంతో పాటు నాలుగు జిల్లాల్లో ఆయనకు మంచి పట్టు ఉండేది.