butta rejuka: ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు: బుట్టా రేణుక

  • ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చాల్సిందే
  • అన్నీ ఇస్తామన్న జైట్లీ.. ఆ తర్వాత మొండి చేయి చూపించారు
  • హోదా, ప్యాకేజీ రెండూ లేకుండా చేశారు

విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవి రాకపోతే... ఎక్కడా రాజీపడబోమని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని... ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీదే అని చెప్పారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఆశతో గత నాలుగేళ్లుగా ఎదురు చూశామని... కానీ, ఏమీ రాలేదని అన్నారు.

అన్నీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన చేశారని... ఆ తర్వాత మొండి చేయి చూపించారని మండిపడ్డారు. చివరి బడ్జెట్ లో కూడా ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రత్యేక ప్రకటన రాకపోవడంతో... ఆందోళన చేస్తున్నామని చెప్పారు. హోదా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... చివరకు హోదా, ప్యాకేజీ రెండూ లేకుండా పోయాయని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు.


butta rejuka
Special Category Status
BJP
Arun Jaitly
  • Loading...

More Telugu News