raghuveera reddy: రఘువీరా సహా పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్

  • ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ రహదారుల దిగ్బంధనం
  • విజయవాడలో ఆందోళన నిర్వహించిన రఘువీరా
  • ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇచ్చిన విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ నేడు ఏపీ వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయవాడలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, రఘువీరారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. 

raghuveera reddy
arrest
Special Category Status
  • Loading...

More Telugu News