Telangana: రూ. 30 లక్షల రివార్డున్న హరిభూషణ్, ఆయన భార్య సమ్మక్క, బడే చొక్కారావులు మరణించారు: పోలీసుల అధికారిక ప్రకటన

- తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
- 10 మంది మరణించారని పోలీసుల ప్రకటన
- తీవ్రంగా గాయపడ్డ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్
- న్యాయవిచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్
ఈ తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ తో పాటు ఆయన భార్య సమ్మక్కతో పాటు మరో ముఖ్య నేత బడే చొక్కారావు సహా 10 మంది మరణించారని పోలీసులు అధికారిక ప్రకటన వెలువరించారు. ఆయన తలపై రూ. 30 లక్షల రివార్డు ఉందని, ఇటీవలి కాలంలో హరిభూషణ్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ పరిధిలో మావోల కార్యకలాపాలు పెంచుతున్నారన్న సమాచారం ఉందని తెలిపారు. ఆయనపై 50 వరకూ కేసులు ఉన్నాయని, పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ ఎన్ కౌంటర్ లో తాము పోలీస్ కమాండర్ సుశీల్ ను పోగొట్టుకున్నామని తెలిపారు.
