allari naresh: ఆ సినిమా పోవడంతో 3 నెలలు నేను గదిలో నుంచి బయటికి రాలేదు: అల్లరి నరేశ్

  • 'నేను' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను 
  • ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను
  • అది ఆడకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లాను

తాజాగా ఐడ్రీమ్స్ తో అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. తన అంచనాలను తలక్రిందులు చేసిన సినిమాను గురించి ప్రస్తావించాడు. " 'నేను' కథ వినగానే చాలా డిఫరెంట్ గా అనిపించింది. దాంతో ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ముందుగా ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో, ఆ సమయంలో వచ్చిన ఆఫర్లను వదులుకున్నాను. ఆ సినిమాలో నా పాత్రను నేను ఎంతో ప్రేమించి చేశాను .. ఎంతగానో కష్టపడ్డాను.

"డూప్ లేకుండా ఫైట్స్ చేయడం వలన చాలా దెబ్బలు తగిలాయి. చూసినవాళ్లంతా సినిమా బాగుందనే అంటున్నారు .. బయట చూస్తే సినిమా ఆడటం లేదు. ఇక కెరియర్ అయిపోయిందనే భయంతో మూడు నెలలపాటు రూమ్ లో నుంచి బయటికిరాకుండా ఆలోచిస్తూ ఉండిపోయాను. మళ్లీ 'కితకితలు'తో దార్లో పడిపోయాను' అని చెప్పుకొచ్చాడు.    

allari naresh
  • Loading...

More Telugu News