JC Diwakar Reddy: మోదీ, అమిత్ షా ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు: బయటకు రాలేరంటూ జేసీ సంచలన వ్యాఖ్య

  • పెద్దమనిషి తరహాలో ప్యాకేజీకి ఒప్పుకున్నారు
  • ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు
  • రాజీనామాలతో ఒరిగేదేమీ లేదు
  • ఎన్డీయే నుంచి వైదొలగినా ప్రభుత్వం పడిపోదు

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పన్నిన ఉచ్చులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిక్కుకున్నారని, దాన్నుంచి ఆయన బయట పడలేకపోతున్నారని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన జేసీ, చంద్రబాబు పెద్దమనిషి తరహాలో హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారని, అది కూడా ఇవ్వకుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని అన్నారు.

 టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా కేంద్రం దిగి వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసిన ఆయన, అమిత్ షాతో ఎంపీలు చర్చలు జరిపినా ఏమీ సాధించలేమని అన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నదే తమ ప్రధాన డిమాండని తేల్చి చెప్పారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తలచుకుంటే ఏ పనైనా జరుగుతుందని అభిప్రాయపడ్డ ఆయన, రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుకు పోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి బయటకు రావాలని ప్రజల నుంచే డిమాండ్ వస్తోందని, తాము ఎన్డీయే నుంచి వైదొలగినా, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని గుర్తు చేశారు. జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయిస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని జేసీ అన్నారు.

JC Diwakar Reddy
Chandrababu
Telugudesam
BJP
Narendra Modi
Amit Shaw
  • Loading...

More Telugu News