bandar: బందరులో తెలుగు తమ్ముళ్ల లొల్లి.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన వైనం!

  • గోపీచంద్ కు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి దక్కకపోవడంపై ఆగ్రహం
  • మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డ నాయకులు
  • గోపీచంద్ పార్టీ వీడతారంటూ ప్రచారం

బందరు టీడీపీలో అలకల పర్వం మొదలైంది. సీనియర్ నేత గొర్రెపాటి గోపీచంద్ కు మద్దతుగా పలువురు నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళ్తే, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని గోపీచంద్ కు కేటాయిస్తారని ఆయన వర్గీయులు భావించారు. అయితే, ఊహించని విధంగా ఆ పదవిని నందిగామకు చెందిన బండారు హనుమంతరావుకు కేటాయిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

దీంతో, గోపీచంద్ వర్గీయులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. రాజీనామాలకు సిద్ధపడ్డారు. బందరు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కుంచె నాని, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గణితిశెట్టి గోపాల్ లతో పాటు పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేస్తామంటూ హెచ్చరించారు. గోపీచంద్ సైతం పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు ఎక్కడివరకు వెళతాయో వేచి చూడాలి.

bandar
Telugudesam
machilipatnam
gopichand
ganithisetty gopal
  • Loading...

More Telugu News