harman preet kaur: నెరవేరిన హర్మన్ ప్రీత్ కౌర్ చిరకాల వాంఛ

  • పంజాబ్ పోలీస్ శాఖలో పని చేయాలని కలలుగన్న హర్మన్ ప్రీత్
  • ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం
  • వరల్డ్ కప్ తరువాత డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేసిన పంజాబ్ ప్రభుత్వం

 భారత మహిళా టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కల నెరవేరింది. సమస్యలన్నీ పరిష్కారమవ్వడంతో ఎట్టకేలకు తనకిష్టమైన పోలీసు ఉద్యోగంలో చేరింది. పంజాబ్ డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన హర్మన్ ప్రీత్ కౌర్ యూనిఫాంకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, డీజీపీ సురేశ్‌ అరోరా నక్షత్రాల సింబల్స్ ను అమర్చారు.

ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, దేశానికి గర్వకారణంగా నిలిచిన హర్మన్‌ ప్రీత్‌ తన బాధ్యతలు మరింత నిబద్ధతతో చేపడతారని ఆశిస్తున్నానని అన్నారు. వృత్తిలో ఆమె మరిన్ని ఘనతలు సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఇండియన్‌ రైల్వేస్‌ లో ఉద్యోగం చేస్తోన్న హర్మన్‌ ప్రీత్‌ కు ఒప్పంద కాలం పూర్తికాకపోవడంతో సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి కలుగజేసుకుని ఆమె డీఎస్పీ ఉద్యోగం స్వీకరించేందుకు సహాయం చేసిన సంగతి తెలిసిందే. 

harman preet kaur
indian cricketer
punjab dsp
punjab
  • Loading...

More Telugu News