mammootty: వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా 'యాత్ర' .. ప్రధాన పాత్రలో మమ్ముట్టి

  • వై.ఎస్.బయోపిక్ కి ఏర్పాట్లు 
  • దర్శకుడిగా మహి వి.రాఘవ్ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మమ్ముట్టి  

ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతూ ఉంటే, మరో వైపున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. వై.ఎస్. జీవితచరిత్రను గతంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కించాలని పూరీ జగన్నాథ్ ప్రయత్నించాడు. అయితే ఎందుకనోగానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

తాజాగా వై.ఎస్. బయోపిక్ ను సిద్ధం చేయడానికి ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ మధ్య 'ఆనందో బ్రహ్మ' సినిమాతో సక్సెస్ ను సాధించిన 'మహి వి.రాఘవ్' ఈ  సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి .. రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రలో 'పాదయాత్ర' ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందువలన ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు.           

  • Error fetching data: Network response was not ok

More Telugu News