vladimir putin: మా దగ్గర కొత్త తరహా అణ్వాయుధాలున్నాయి.. గుబులు రేపుతున్న రష్యా ప్రకటన

  • నాలుగోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పుతిన్ 
  • మా దగ్గర కొత్త అణ్వాయుధాలున్నాయి 
  • ప్రపంచంలో ఏ మూలకైనా ప్రయాణించగలవు

తమ దగ్గర కొత్తతరం అణ్వాయుధాలున్నాయంటూ ర‌ష్యా విడుదల చేసిన ప్రకటన ప్రపంచదేశాల్లో ప్రకంపనలు రేపుతోంది. నాలుగవసారి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వ్లాదిమిర్ పుతిన్ ఈ విష‌యాన్ని ప్రకటిస్తూ, తమ వద్ద ప్రపంచంలోని ఏ మూలకైనా ప్రయాణించగల క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయని అన్నారు. అలాగే రెండు కొత్త త‌ర‌హా న్యూక్లియ‌ర్ డెలివ‌రీ సిస్ట‌మ్స్‌ ను అభివృద్ధి చేశామని ఆయన వెల్లడించారు.

త‌మ వ‌ద్ద ఉన్న ఈ కొత్త త‌ర‌హా అణ్వాయుధాలు ఏ టార్గెట్ నైనా కొట్టగలవని ఆయన ప్రకటించారు. తాము తయారు చేసిన అణ్వాయుధాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని, వాటిని గుర్తించడం ఎవరి తరమూ కాదని ఆయన చెప్పారు. అమెరికానుద్దేశించి.. పాశ్చాత్య దేశాలు త‌న మాట‌ల‌ను గ్రహిస్తూ ఉంటాయ‌నుకుంటున్నట్టు హెచ్చరించారు.

vladimir putin
putin
Russia
  • Loading...

More Telugu News