Narendra Modi: ప్రధానిపై కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ను అడిగాను!: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

  • ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం
  • మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగాను
  • కేసీఆర్ అలా అనాల్సింది కాదని కేటీఆర్ చెప్పారు

ఇటీవల జరిగిన రైతు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. తాను మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగానని, కేసీఆర్ అలా అనాల్సింది కాదని కేటీఆర్ చెప్పారని నిర్మలా సీతారామన్ అన్నారు. కాగా, ప్రధానిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Narendra Modi
nirmala seeta raman
KCR
  • Loading...

More Telugu News