cabinet: ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయేవారిపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం
- వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
- త్వరలోనే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటు
- ఆర్థిక నేరగాళ్లకు కచ్చితంగా శిక్షలు పడేలా చేసేలా నిర్ణయం
వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలాంటి వారు భారతీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ఆర్థిక నేరగాళ్ల బినామీ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవచ్చు.
అలాగే, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్థిక నేరగాళ్లకు కచ్చితంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం మరో బిల్లును కూడా రూపొందిస్తుందని తెలిపారు.