kakinada: వర్శిటీలో కీచక ప్రొఫెసర్లు ఉండటం బాధాకరం: నన్నపనేని రాజకుమారి

  • నిందితుడికి చట్టపరంగా శిక్షపడేలా చూస్తాం
  • విద్యార్థులతో కలిసి న్యాయ పోరాటం చేస్తాం
  • ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని

కాకినాడ జేఎన్టీయూలో లైంగిక వేధింపుల బాధితులను ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈరోజు పరామర్శించారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, వర్శిటీల్లో కీచక ప్రొఫెసర్లు ఉండటం బాధాకరమని, నిందితుడికి చట్టపరంగా శిక్షపడేలా చూస్తామని, విద్యార్థులతో కలిసి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. కాగా, గత నెలలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల బారిన పడ్డ ఎంటెక్ విద్యార్థినులు యూనివర్శిటీ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. ఉపకులపతి ఆదేశాల మేరకు విచారణకు ఆదేశించడం జరిగింది.

kakinada
nannapaneni
  • Loading...

More Telugu News